Neeve Naa Song Lyrics – Mayabazar Movie

Neeve Naa Song Lyrics in Telugu

నీవేనా…
నీవేనా నను తలిచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలచి
హృదయం కలవరపరిచినది …”నీవేనా”

నీవేలే నను తలచినది
నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలచి

హృదయము కలవరపరిచినది….నీవేలే
కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా “కలలోనే”

కలయో నిజమో వైష్ణవమాయయో
తెలిసి తెలియని అయోమయంలో “నీవేనా”

కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి “కన్నుల”

కనులను మనసును కరగించి
మైమరపించి – నన్నలరించి “నీవేలే”

Click here for the details of :