Jabilammavo song lyrics – Bunny Movie

Jabilammavo song lyrics In Telugu

జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనెపట్టువో ఐ డోంట్ నో వాట్ టు డు
ఇంటిముందు రంగవల్లివో ఓ చెలీ పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన భక్తి పాటవో ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహామై ప్రాణమై నిలిచి నావుగా
జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు
ఓ నీ పెదాలపైన నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి ఆ జగలలోని ప్రేమ పంచనా
బొట్టుమీద ఒట్టు పెట్టనా కాటుకళ్ళే కావలుండనా
గుండెమీద ఒట్టు పెట్టనా పడగలోన గూడు కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా
జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు
ఓ నీ మనస్సు లోకి నా మనస్సు చేరి
నీ మనస్సు లోకి నా మనస్సు చేరి ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దు పెట్టనా ముడుముళ్ల బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజ్యమివ్వనా
జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు